శేరిలింగంపల్లి, డిసెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్ పల్లిలో మూసాపేట్ జోనల్ పరిధిలోని కూకట్ పల్లి, వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ,హైదర్ నగర్ డివిజన్లలోని పలు కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్స్ , మౌలిక సదుపాయాల కల్పనకై మూసాపేట్ జి.హెచ్.ఏం. సి కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ కి సమస్యలపై బీజేపీ కార్యవర్గ సభ్యుడు సురభి రవీందర్ రావు, ముఖ్య నాయకులతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూకట్ పల్లి, వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ,హైదర్ నగర్ డివిజన్లలోని దాదాపు అన్ని కాలనీలు, బస్తీ లలో రోడ్లు , డ్రైనేజీ వ్యవస్థ చాలా వరకు దెబ్బతిన్నాయని, కొన్ని ప్రదేశాలలో స్ట్రీట్ లైట్స్ లేవని, సరిగా క్లీనింగ్ చేయకపోవడం వలన దోమలు చేరి వాటి వలన ప్రజలు , చిన్న పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. కనుక సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మణి భూషణ్, రామరాజు, నరేందర్ రెడ్డి, కేశవ్, నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, కుమార్ యాదవ్, వెంకటస్వామి రెడ్డి, అరుణ్ కుమార్ , గోపాల్ రావు, బాలు యాదవ్, రాజిరెడ్డి , కృష్ణంరాజు , ఎత్తరి రమేష్ రాయల్, రామ్ రెడ్డి , నరేష్ , సంపత్, స్రవంతి, లలిత రెడ్డి, దామోదర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సుదర్శన్ పాల్గొన్నారు.