శేరిలింగంపల్లి, డిసెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): సోనియా గాంధీ జన్మదినంను పురస్కరించుకుని ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని సురభి కాలనీ ఎంపిపిఎస్ ప్రభుత్వ పాఠశాలలో DOC-ONLINE వారు నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపును శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన తెలంగాణ ప్రదాత సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో SMC ఛైర్మెన్ బస్వరాజ్, వార్డ్ మెంబర్ శ్రీకళ, స్కూల్ హెచ్ఎం పాండురంగ రెడ్డి, దేవదాస్, ఆశ్రఫ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, పురం విష్ణు వర్ధన్ రెడ్డి, సురభి కాలనీ ప్రెసిడెంట్లు చంద్రశేఖర్, వెంకట్ రెడ్డి, జయకృష్ణ, సుధారాణి, కుమారి, DOC-ONLINE జనరల్ మేనేజర్ వంశీ, ప్రోగ్రాం మేనేజర్ గౌతమ్ కుమార్, విద్యార్థులు వారి తల్లితండ్రులు, స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు.