గ‌చ్చిబౌలి కేర్ హాస్పిట‌ల్ ఎదుట బాధితుల ఆందోళ‌న

  • చ‌నిపోయిన వ్య‌క్తికి చికిత్స చేసి బిల్లు క‌ట్టించుకున్నార‌ని ఆరోప‌ణ
  • హాస్పిటల్ యాజ‌మాన్యంపై చ‌ర్య‌లు తీసుకోవాలని బాధితుల డిమాండ్

గచ్చిబౌలి‌ (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి కేర్ హాస్పటల్ వైద్యులు చనిపోయిన వ్యక్తికి చికిత్స చేస్తున్నామని చెప్పి తమను మోసం చేశారని, డబ్బులు కట్టించుకుని చివరకు శవాన్ని అప్పగించారంటూ కేర్ హాస్పిటల్ ఎదుట‌ బాధితులు ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సుఖ్ దేవ్ (34) భార్యాపిలల్లతో కలిసి బోయిన్ పల్లిలో నివసిస్తూ పెయింటింగ్ పని చేస్తున్నాడు. ఈనెల 7న తన బైక్ పై పెయింటింగ్ వేసే పనిమీద బయటకు వెళ్తుండగా గుర్తు తెలియని కారు సుఖ్ దేవ్ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సుఖ్ దేవ్ ను కుటుంబ సభ్యులు గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అతను ఈ నెల 8న మరణించినట్టు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అతనికి మెరుగైన చికిత్స చేస్తున్నామని చెప్పి డాక్టర్లు రూ.3లక్షల కట్టించుకున్నారని, చివరకు చనిపోయాడంటూ శవాన్ని అప్పగించారని ఆస్పత్రి ఎదుట మృతుడి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

హాస్పిట‌ల్ లో ఆందోళ‌న చేస్తున్న మృతుడి కుటుంబ స‌భ్యులు, బంధువులు
గ‌చ్చిబౌలిలోని కేర్ హాస్పిట‌ల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here