ఘ‌నంగా వెంక‌టేశ్వ‌ర స్వామి క‌ల్యాణ మ‌హోత్స‌వం

చందాన‌గ‌ర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందాన‌గ‌ర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్ర‌వారం ధనుర్మాసం సంద‌ర్భంగా స్వామి వారి జన్మనక్షత్రం శ్రవణం నేప‌థ్యంలో ఉదయం 10 గంట‌లకు శ్రీ పద్మావతి మాత శ్రీ గోదాదేవి మాత సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకుడు సత్యసాయి ఆచార్యుల ఆధ్వ‌ర్యంలో కన్నుల పండువగా నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యవర్గ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని ద‌ర్శించుకుని పూజ‌లు చేసి తీర్ధ ప్రసాదాల‌ను స్వీకరించారు. ఈ సంద‌ర్భంగా శేరిలింగంపల్లి ప్రముఖ బిల్డర్ యు.వి.రమణ మూర్తి కుటుంబ సభ్యులు స్వామి వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

శ్రీ వారి కల్యాణంలో పాల్గొన్న శేరిలింగంపల్లి ప్రముఖ బిల్డర్ యు.వి.రమణ మూర్తి కుటుంబ సభ్యులు
కల్యాణంలో పాల్గొన్న భక్తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here