మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తున్నారని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని దీప్తిహిల్స్ క్రీస్తు సంఘం చర్చిలో రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్లకు క్రిస్మస్ సందర్భంగా పంపిణీ చేసిన దుస్తులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. అనంతరం ఆయన క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాయకులు భిక్షపతి ముదిరాజ్, మధుసూదన్ రెడ్డి, గౌస్, వార్డ్ సభ్యులు రామచందర్, సహదేవ్, రాజు ముదిరాజ్, కృష్ణ గౌడ్, హున్య నాయక్, సార్వార్, సాంబయ్య, గోపాల్ నాయక్, ఓ.కృష్ణ, సతీష్ యాదవ్, వంశీ యాదవ్, శ్రీనివాస్ గుప్తా, ఖాజా, నయీమ్, లోకేష్, వినోద్ గౌడ్, షకీల్, సయ్యద్ షైబజ్, అమీర్, సోహెయిల్, డేవిడ్, బి.ఎన్.విల్సన్, సుందర్ రాజు, శ్రీనివాస్ నాయక్, కే శంకర్, ఎస్.తిరుపతి, నవీన్ యాదవ్, రాజు కుమార్, నవీన్, శేరిలింగంపల్లి హైటెక్ పాస్టర్స్ అధ్యక్షుడు టి.ఆర్.రాజు, మాదాపూర్ డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్, పాస్టర్స్ సామ్సన్, సిల్వరాజు, ఆగస్తీన్, బిఆర్ మనోహర్, బి.ఎన్ యేసు దాస్, బర్న బోస్, డి.విల్సన్, సతీష్, ఇమనుల్, వినోద్, అభిషేక్, లింగబాబు, యేసయ్య, కే దాస్, విశ్వాస రావు, నాగేశ్వర్ రావు, జోయల్ ప్రసాద్ పాల్గొన్నారు.
