చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ని చందానగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కసిరెడ్డి సింధురెడ్డి శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సింధు రెడ్డికి ఎన్నికల్లో తెరాసకు గట్టిపోటీ ఇవ్వడంపై కితాబిచ్చారు. తక్కువ సమయంలో ఎక్కువ ఓట్లు సాధించి తెరాసకు గట్టి పోటీ ఇచ్చి ప్రజల మద్దతు పొందారని అన్నారు. జనం కోసం జనంలో ఉండి మరింత పట్టుదలతో పార్టీని అభివృద్ధి పథంలో నడిపించాలని బండి సంజయ్ కసిరెడ్డి సింధురెడ్డికి సూచించారు. ఈ సందర్భంగా ఆమెను ఆయన అభినందించారు.






