కాలును కోల్పోయిన బాధితుడికి వాసిలి చంద్ర‌శేఖ‌ర్ స‌హాయం

మియాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి‌): ప్ర‌మాదంలో కాలును కోల్పోయిన ఓ బాధితుడికి తెరాస నాయ‌కుడు వాసిలి చంద్ర‌శేఖ‌ర్ స‌హాయం అందించారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్ కాలనీకి చెందిన వెంకటయ్య రెండు సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం లో ప్రమాదవశాత్తూ కాలును కోల్పోయాడు. ఈ క్ర‌మంలో స‌మాచారం తెలుసుకున్న తెరాస సీనియర్ నాయకుడు వాసిలి చంద్రశేఖర్ బాధితుడికి గురువారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ల చేతుల మీదుగా రూ.1.40 ల‌క్ష‌ల మొత్తంతో రూపొందించిన కృత్రిమ కాలును అందజేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ చేసిన సేవ అభినందనీయం అని అన్నారు. స‌మాజంలో ఇలాంటి బాధితుల‌ను ఆదుకునేందుకు దాత‌లు ముందుకు రావాల‌న్నారు. బాధితుడికి తాము అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు వాల‌ హరీష్, మోహన్ ముదిరాజ్, గంగాధర్, బీఎస్ఎన్‌ కిరణ్ యాదవ్, మాధవరం గోపాల్, గోపరాజు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, చంద్రిక ప్రసాద్, రోజా, సుప్రజ పాల్గొన్నారు.

బాధితుడికి కృత్రిమ కాలును అంద‌జేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, వాసిలి చంద్ర‌శేఖ‌ర్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here