హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 17 మంది అంగన్‌వాడీ టీచర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు. మొత్తం 25 మంది ఉండగా వారిలో 17 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ నెల 16వ తేదీన వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా హఫీజ్‌పేట ఆరోగ్య కేంద్రంలో ఇప్పటి వరకు మొత్తం 61 మంది లబ్ధిదారుల్లో 45 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. మరో 16 మంది వ్యాక్సిన్ తీసుకోలేదు. డాక్టర్ వినయ్ బాబు పర్యవేక్షణలో వ్యాక్సినేషన్‌ను చేపట్టారు.