ప్ర‌భుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చొరవతో శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధి

  • కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

హ‌ఫీజ్‌పేట‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ప్రశాంతి నగర్ లో వివిధ అభివృద్ధి పనులను గురువారం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్ర‌భుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చొరవతో డివిజన్ ను అన్ని విధాలా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న‌ట్లు తెలిపారు. దశలవారీగా డివిజన్ లోని కాలనీలలో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రశాంత్ నగర్ లో నెలకొన్న రోడ్డు, డ్రైనేజీ, మంచినీటి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు జె.యాదయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ దాసోజ్, వెంకటేశ్వర రెడ్డి, పార్థసారథి, అశోక్ కుమార్, బాబు కుట్టేన్, సువిజయ్, సతీష్, విజయ్, సుధాకర్, గోపి నగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, నెహ్రూ నగర్ బస్తీ యూత్ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ దేవులపల్లి, ఘనపురం రవీందర్, పట్లోళ్ల‌నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here