హిందూ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మే నెల 2వ తేదీన జరగనున్న‌ హిందూ సమ్మేళనంకి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్క‌రించారు. హఫీజ్ పేట లో జరిగిన కార్య‌క్ర‌మంలో హిందూ ధర్మ సమ్మేళనం సభ్యులు పోస్ట‌ర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట హిందూ సమ్మేళనం ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు. హిందూ సభకు సంబంధించిన మొదటి చందా రూ.25వేల‌ను బిఎల్‌వై చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బోయిని మహేష్ యాదవ్ సమ్మేళనం సభ్యులకు ఇచ్చి మొదటి రశీదు పొందారు. మే 2న హిందూ సమ్మేళనం కార్యక్రమంలో అధిక సంఖ్యలో హిందువులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భూషణ్, కమిటీ అధ్యక్షుడు ఆచారి, గౌరవ అధ్యక్షుడు నరహరి పటేల్, ముఖ్య సలహాదారులు బాలింగ్ యాదగిరి గౌడ్, కృష్ణ యాదవ్, వెంకటేష్ గౌడ్, నరేందర్ గౌడ్, కుమ్మరి శ్రీశైలం, విక్రాంత్ రెడ్డి, సంజీవరెడ్డి, సుధాకర్, సంజు, సురేష్, సంతోష్ గౌడ్, సాయి, మన్నె వెంకటేష్, వాసు, మనోజ్ యాదవ్, నవీన్, పాండు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here