ఎంపీ తేజ‌స్వి వ్యాఖ్య‌లు అవ‌మాన‌క‌రం: క‌ట్ల శేఖ‌ర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారత దేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని భారత్-పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ లోక్‌సభలో ఎంపీ తేజ‌స్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని నాయ‌కుడు క‌ట్ల శేఖ‌ర్ రెడ్డి అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చందాన‌గ‌ర్ బ‌స్ స్టాప్ వ‌ద్ద నిరాహార దీక్ష కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. తెలంగాణ రాష్ట్రం ప్రజల దీర్ఘకాల పోరాట ఫలితమ‌ని, అలాంటి పవిత్రమైన ఉద్యమాన్ని అవమానించే విధంగా చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయ‌ని అన్నారు. తెలంగాణ గౌరవాన్ని కాపాడటానికి ఇలాంటి అవమానకర వ్యాఖ్యలకు వ్యతిరేకంగా త‌మ‌ పోరాటం కొనసాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక నాయ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here