శేరిలింగంపల్లి, ఏప్రిల్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువు వాకింగ్ ట్రాక్ శుద్ధి కార్యక్రమాన్ని GHMC శానిటేషన్ విభాగానికి చెందిన ఏఈ, డిఈ, శానిటేషన్ ఇన్స్పెక్టర్, సమీప కాలనీల ప్రజలు, వాకర్స్ తో కలసి హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పరిశీలించారు. లుక్స్ గ్లోబల్ ఫౌండేషన్, ఒరాకిల్ వాలంటీర్స్ సంయుక్తంగా వాకింగ్ ట్రాక్ శుద్ధి కార్యక్రమం చేస్తున్నందుకు వారిని అభినందించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ వాకింగ్ ట్రాక్ శుభ్రంగా ఉంటే నడకకు వచ్చే వారికి ఆహ్లాదకరమైన, స్వచ్ఛమైన గాలి లభిస్తుందన్నారు. ఇది శ్వాసకోస సంబంధిత సమస్యలను తగ్గిస్తుందని, పేరుకుపోయిన చెత్తను తొలగించడం వల్ల దోమలు, ఈగలు, ఇతర కీటకాలు వ్యాపించకుండా ఉంటాయన్నారు. దీనివల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ శానిటేషన్ డిఈ శంకర్ గణేష్, ఏఈ బంసి పాటిల్, SRP సత్యనారాయణ, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, సమీప కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






