శేరిలింగంపల్లి, మార్చి 25 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ్ నగర్ కాలనీ, టేకు నరసింహ నగర్ కాలనీలలో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీల వాసులు మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. దీనిపై ఉప్పలపాటి శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. జయప్రకాష్ నారాయణ్ నగర్ కాలనీ, టేకు నరసింహ నగర్ కాలనీలలో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై తనను స్థానికులు కలిశారని, తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, పీఏసీ చైర్మెన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో కాలనీలలో నెలకొన్న వివిధ సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తామని తెలిపారు. కాలనీలలో అసంపూర్తిగా మిగిలి పోయిన యూజీడీ పనులను, సీసీ రోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జయప్రకాష్ నారాయణ్ నగర్ కాలనీ అధ్యక్షుడు మోహన్ రావు, కాలనీ వాసులు గంగా రామారావు, సంజీవ రావు, వెంకట కృష్ణయ్య, జీవన్, అంకయ్యా, టేకు నరసింహ నగర్ కాలనీ వాసులు కప్పెర రమేష్, చంద్రకళ, శివరాములు, శ్రీను, రాములు, మహేష్, వెంకటేష్, స్వరూప తదితరులు పాల్గొన్నారు.






