శేరిలింగంపల్లి, మార్చి 25 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ కి చెందిన జాలయ్య వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా CMRF ద్వారా మంజూరైన రూ.44వేల ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కును మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని అన్నారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘునందన్ రెడ్డి, బ్రిక్ శ్రీనివాస్, జిల్లా గణేష్ , పోతుల రాజేందర్, అష్రాఫ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






