శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా వరికుప్పల రాములు, గౌరవ అధ్యక్షుడిగా జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా చంద్రయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.






