కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎస్వీఆర్ మోటార్స్ నూతన షోరూంను డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శనివారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీఆర్ మోటార్స్ యాజమానులు, మియాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, హఫీజ్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, వార్డు మెంబర్స్ శ్రీనివాస్ చౌదరి, జంగం గౌడ్, స్థానికులు పాల్గొన్నారు.