గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకూ జరుగుతున్న మేలును గ్రహించి, ఎందరో కార్యకర్తలు బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జి గజ్జల యోగానంద్ అన్నారు. శనివారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండాలో పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేశారు. ఈ సందర్బంగా వారికి యోగానంద్ బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం యోగానంద్ మాట్లాడుతూ.. ఎన్నో ఆశలతో సాధించుకున్న తెలంగాణలో రాష్ట్రంలో మితిమీరిపోతున్న అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం ఆగడాలకు చెక్ పెట్టి, ప్రజలకు మరింత మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలను ఆయన స్వాగతించారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పథకాలు, ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులైన పలువురు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్ అధ్యక్షతన, సీనియర్ నాయకుడు సురేష్ మట్ట ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు వసంత్, కృష్ణ ముదిరాజ్, రవీంద్ర దూబే, నరేందర్ ముదిరాజ్, నరేందర్ గౌడ్, మహేందర్ గౌడ్, అనిల్ గౌడ్, స్వామి గౌడ్, నరసింహరావు, కిషన్, విజయ్, నరేష్, శ్రీకాంత్, సురేష్, అశోక్, శివ, బాలరాజ్, రాజు చెట్టి, రమేష్ సోమిశెట్టి తదితరులు పాల్గొన్నారు.