న‌ల్ల‌గండ్ల మార్కెట్‌లో డీసీ, కార్పొరేట‌ర్ ప‌ర్య‌ట‌న

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల కూరగాయల మార్కెట్ లో శనివారం డిప్యూటీ కమిషనర్ వెంకన్నతో‌ కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించారు. మార్కెట్ లో నెలకొన్న సమస్యలను డీసీ వెంకన్నకు వివరించారు. మార్కెట్ చుట్టు పక్కల ఉన్న ప్రహరీ గోడ ఎత్తును పెంచాలని, పక్కన ఉన్న నాలాకు మెష్షింగ్ చేయాలని చెప్పారు.

న‌ల్ల‌గండ్ల మార్కెట్‌లో ప‌ర్య‌టిస్తున్న డిప్యూటీ కమిషనర్ వెంకన్న, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

మార్కెట్ లోని అంతర్గత మురికి కాలువలు తెరిచి ఉండడంతో దుర్వాసన వెదజల్లుతోందని మార్కెట్ కమిటీ సభ్యులు చెప్ప‌గా వాటిని మూసివేసేలా చూడాలని డీసీని కార్పొరేటర్ రాగం‌ నాగేందర్ యాదవ్ కోరారు. మార్కెట్ కు మూడు గేట్లు పెట్టాలని అదేవిధంగా నల్లగండ్ల‌ కూరగాయల మార్కెట్ పేరుతో రెండు బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. మార్కెట్ లో ఎన్నో ఏళ్ల క్రితం వేసిన షెడ్లు శిథిలావస్థకు చేరాయని కొత్త షెడ్లను ఏర్పాటు చేయాలని రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ పార్టీ డివిజ‌న్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, మార్కెట్ కమిటీ కార్యదర్శి ఖాజాపాషా, ఉపాధ్యక్షుడు అహ్మద్ పాషా, ఏఎంహెచ్ఓ డాక్టర్ రంజిత్, ఏఈ సునిల్, ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

మార్కెట్ స‌మీపంలో స‌మ‌స్య‌ను ప‌రిశీలిస్తున్న డిప్యూటీ కమిషనర్ వెంకన్న, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here