ప్ర‌వేశ‌ప‌రీక్ష రాసేందుకు వెళ్తూ.. కాన‌రాని లోకాల‌కు..

  • రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రి మృతి

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): లారీ డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం కార‌ణంగా రెండు ప్రాణాలు గాల్లో క‌లిసిపోయాయి. అతివేగంగా, నిర్ల‌క్ష్యంగా లారీని న‌డిపించ‌డం వ‌ల్ల ముందు వెళ్తున్న ద్విచ‌క్ర వాహ‌నాన్ని బ‌లంగా ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు అక్క‌డిక్క‌డే చ‌నిపోయారు. చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ కు చెందిన పంచాల శ్రీ‌నివాస్ (24), జ‌హీరాబాద్ బాగారెడ్డిప‌ల్లికి చెందిన ఈప్తి శ్వేత (23)లు మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా కంపెనీలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ప‌నిచేస్తున్నారు. కాగా శ్వేత ఆదివారం మౌలాలిలో డీసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష రాసేందుకు స‌హ ఉద్యోగి శ్రీ‌నివాస్‌తో క‌లిసి ద్విచ‌క్ర వాహ‌నంపై చందాన‌గ‌ర్ నుంచి కూక‌ట్‌ప‌ల్లి వైపు వెళ్తున్నారు. వెనుక నుంచి వ‌చ్చిన లారీ (ఆర్‌జే14జి1578) మదినగూడ బస్ స్టాప్ వద్దకు రాగానే వారి వాహ‌నాన్ని బ‌లంగా ఢీకొట్టింది. లారీ డ్రైవ‌ర్ అతి వేగంగా న‌డిపిస్తూ వారి వాహ‌నాన్ని ఢీకొట్టాడంతో ఆ ఇద్ద‌రికీ తీవ్ర‌గాయాలై అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఈ మేర‌కు స‌మాచారం అందుకున్న మియాపూ‌ర్ పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ఆ ఇద్ద‌రి మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి త‌ర‌లించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన శ్వేత, శ్రీ‌నివాస్ (ఫైల్‌)
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here