- కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): పట్టభద్రులు త్వరలో జరగబోయే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాను ఓటరుగా నమోదు చేయించుకోవాలని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సూచించారు. శ్రీరాం నగర్ బి, సి బ్లాక్ లలో అసోసియేషన్ సభ్యులతో కలిసి పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని శనివారం రాత్రి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ నిర్వహించారు.
పట్టభద్రులందరికీ ఓటరు నమోదు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత శ్రీ రాం నగర్ బి, సి బ్లాక్ లలో అన్ని సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. తాగు నీటి కోసం ప్రత్యేకంగా రిజర్వాయర్ ను ఏర్పాటు చేశామని, 80 శాతం సీసీ రోడ్లు, యూజీడీ లైన్లను ఏర్పాటు చేయించామన్నారు. అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ కు పట్టం కట్టాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు గ్రాడ్యుయేట్లందరూ ఓటరు గా నమోదు చేసుకుని విజయవంతం చేయాలని రాగం నాగేందర్ యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి క్రాంతి, అసోసియేషన్ సభ్యులు శేఖర్, వెంకటేశ్వర్ రావు, సాంబశివరావు, నాగమణి, అర్చన, శోభ, బసవశంకర్, మోహన్ రెడ్డి, నర్సింగ్ రావు, రాజు తదితరులు పాల్గొన్నారు.