నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీ ద్వి దశాబ్ది వేడుకల్లో భాగంగా హైటెక్స్ లో ఈ నెల 25న నిర్వహించనున్న పార్టీ ప్లీనరీ సమావేశం ఏర్పాట్లనయ, సభ వేదిక ప్రాంగణం ను, వాహనాల పార్కింగ్ తదితర వాటిని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్, టీఎస్ఐసీసీ చైర్మెన్ గ్యాదరి బాలమల్లు, పౌర సరఫరాల ఛైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కృష్ణ రావు, కాలే యాదయ్య, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, మాజీ మేయర్ బొంతు రాం మోహన్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ రంగరావు పరిశీలించారు. ప్లీనరీ సమావేశానికి వచ్చే ప్రజా ప్రతినిధుల కోసం చేస్తున్న ఏర్పాట్లు, సభవేదిక ను, పార్కింగ్ ఏర్పాట్లన్నింటిని పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరగా పూర్తి చేయాలన్నారు. వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, పార్టీ నాయకులు పురుషోత్తం యాదవ్, గంధం రాములు, లక్ష్మారెడ్డి, మోహన్ ముదిరాజు, ప్రసాద్, బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, నల్ల సంజీవ రెడ్డి, ప్రసాద్, బాలింగ్ యాదగిరి గౌడ్, రాంచందర్, దొంతి శేఖర్, తిరుమలేష్, కంది జ్ఞానేశ్వర్, సయ్యద్ గౌస్, శ్యామ్, జామిర్, అశీల శివ, లోకేష్, జ్ఞనేశ్వర్, ఇమ్రాన్, సాబేర్, సుదేష్, తైలి గిరి, శ్రీనివాస్ నాయక్, రషీద్, ఖాసిం, కార్యకర్తలు పాల్గొన్నారు.