మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ విలేజ్ లో డివిజన్ తెరాస నాయకుడు మహేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శుక్రవారం తెరాస సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పలువురికి సభ్యత్వాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరస నాయకులు పురుషోత్తం యాదవ్, అన్వర్ షరీఫ్, మోహన్ ముదిరాజ్, బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, మాధవరం గోపాల్, ముప్పవరపు గంగాధర్ రావు, మైనార్టీ నాయకులు కాజా పాషా, ముజిబ్, సుప్రజా, స్వరూప పాల్గొన్నారు.
