శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శ్రీ తుల్జాభవాని దేవస్థానం ప్రాంగణంలో నూతన ప్రాకారం నిర్మాణానికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్‌పేట డివిజన్ అధ్యక్షుడు గౌతమ్ గౌడ్, ఆలయ కమిటీ ఛైర్మన్ మల్లికార్జున శర్మ, కమిటీ ప్రతినిధులు సంజీవరెడ్డి, గోవింద్ చారి, రాజు తివారి, రేణుక గౌడ్, సంపత్ గుప్తా, నటరాజ గుప్తా, బీకే రాఘవరెడ్డి, చంద్రశేఖర్, కాంతయ్య, బచ్చు రాజు పాల్గొన్నారు.
