తప్పుడు ఆరోపణలు చేసిన వారు సమాధానం చెప్పాలి.. లేదంటే కోటి రూపాయల పరువు నష్టం దావా వేస్తాం..

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 10 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ లోని బస్ బాడీ యూనిట్‌ వద్ద ఉన్న కాళీ మాత ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు అవకతవకలకు పాల్పడుతున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్న టి. సంతోష్ రెడ్డి, మాజీ పూజారి బి. సందీప్, జి. శ్రావణ్ కుమార్, గోపాల్, సాయిలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు శ్రీ కనకదుర్గమ్మ కాళీ మాత టెంపుల్ కమిటీ సభ్యులు తెలిపారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తాము 2000 సంవత్సరం నుండి ఆర్. కృష్ణ గౌడ్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారని, తాము ఆలయానికి సంబంధించిన అన్ని లావాదేవీలు చట్టబద్ధంగానే చేశామని తెలిపారు. పాత కమిటీలో ఉన్న సభ్యులు భక్తులు ఇచ్చిన విరాళాలను పక్కదారి పట్టించిందని ఓ భక్తుడు అందజేసిన వెండి కోరటం సందీప్ అనే పూజారి ఇంట్లో పెట్టుకున్నాడని అతనే ఒప్పుకున్నట్లు తెలిపారు.

శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి రూ.14 లక్షలకు సంబంధించి లెక్కలు చూపాలని, కమిటీలో లేని సాయి అనే వ్యక్తిని ఆలయంలోకి ఎలా రానిచ్చారని ప్రశ్నించారు. వారు చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పకపోతే కోటి రూపాయల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే వారిపై సైబరాబాద్ సీపీ, డీసీపీ, ఎసిపి, సిఐలకు పిర్యాదు చేసినట్లు తెలిపారు. వారి ప్రవర్తన నచ్చక కమిటీని నుండి తొల‌గించగా ఆలయ పూజారి సందీప్ తన జీవనాధారం పోయిందని, తనని పూజారిగా పెట్టుకోవాలని కోర్టుకు వెళ్లాడని, కింది కోర్టు కొట్టేస్తే జిల్లా కోర్టుకు వెళ్లడం జరిగిందని తెలిపారు. ఆలయానికి సంబంధించిన నగలు, డబ్బులు బ్యాంక్ అకౌంట్ తీసి అందులో భద్రపరిచామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఆర్. కృష్ణ గౌడ్, జనరల్ సెక్రటరీ ఏకాంత్ గౌడ్, జాయింట్ సెక్రటరీ పాపి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ టి.రామచందర్, పూజారి మనోజ్ కుమార్ పాఠక్, కమిటీ సభ్యులు రేఖ‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here