శేరిలింగంపల్లి, డిసెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని సత్యనారాయణ ఎన్క్లేవ్ కాలనీలో ఉన్న షారోన్ ఎ.జి. చర్చిలో శేరిలింగంపల్లి నియోజకవర్గం పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీక్రిస్మస్ వేడుకలలో సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, పాస్టర్లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని పాస్టర్ల అందరి మధ్యలో కేక్ కట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. శాంతి, నీతి, ప్రేమ, దయ కరుణలతో ప్రపంచానికి కొత్త మార్గం నిర్దేశించిన క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.






