PA నగర్ కాలనీలో ఘ‌నంగా శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 10 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని PA నగర్ కాలనీలో జరిగిన శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, అయ్యప్ప స్వాములు, భక్తులతో కలిసి PAC చైర్మన్ అరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా చేయాలని తెలిపేదే అయ్యప్ప తత్వమని అన్నారు. మనలోని దుర్గుణాలను వదిలి సన్మార్గం వైపుగా నడిపేదే అయ్యప్ప దీక్ష‌ అని PAC చైర్మన్ గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంచందర్, యశ్వంత్ , రాహుల్ అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here