శేరిలింగంపల్లి, జనవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ జవహర్ కాలనీ లో పార్క్ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ. 25 లక్షల నిధుల పేరిట 25 నెలల క్రితం అంగరంగ వైభవంగా MLA తో పాటు అగ్ర నాయకులు హాజరై కాలనీ వాసులచే శిలా ఫలకం ఏర్పాటు చేశారని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి అన్నారు. 25 నెలలు గడుస్తున్నా చెప్పులు అరిగెలా కాలనీ వాసులు MLA చుట్టూ తిరిగినా, పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. మళ్ళీ ప్రజలను మభ్యపెట్టడానికి మళ్ళీ కొత్త శిలాఫలకాలను పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి కోట్లాది రూపాయల పనులు చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయని, కేవలం శిలాఫలకాలు వేసి వదిలేశారని, అవి ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయని అన్నారు. ప్రజల ఓట్ల కోసం పనులు చేపట్టినట్లు నటిస్తున్నారని, కానీ ఆ పనులు శిలాఫలకాలకే పరిమితం అవుతున్నాయని, ప్రజలు ఆలోచించి వాస్తవాలు గ్రహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సలీం, చందర్ రావు, గౌస్, ప్రమోద్, అనంత రెడ్డి, సునీత,శబనా తదితరులు పాల్గొన్నారు.






