అంగ‌న్ వాడీ కేంద్రాల‌ను బ‌లోపేతం చేసేందుకు ఎస్‌బీఐ కృషి: సీనియ‌ర్ మేనేజ‌ర్ బాల‌రాజ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాష్ట్రంలోని అంగ‌న్ వాడీ కేంద్రాల‌ను బ‌లోపేతం చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ముందుకు వ‌చ్చింద‌ని ఎస్బీఐ కొత్త‌గూడ బ్రాంచ్ సీనియ‌ర్ మేనేజ‌ర్ బాల‌రాజ్ అన్నారు. ఎస్‌బీఐ పాన్ ఇండియా సీఎస్ఆర్ నిధుల కింద ఐసీడీఎస్ శేరిలింగంప‌ల్లి ప్రాజెక్ట్ ప‌రిధిలోని ఆదిత్య న‌గ‌ర్ సెక్టార్ లో ఉన్న ఆదిత్య‌న‌గ‌ర్ అంగ‌న్ వాడీ కేంద్రం-1లోని చిన్నారుల‌కు ఎల్ఈడీ టీవీ, రైస్ కుక్క‌ర్‌, వాట‌ర్ ఫిల్ట‌ర్‌, సెల్స్ రాక్‌, వాల్ క్లాక్‌, ఆట వ‌స్తువులు, స్కూల్ బ్యాగ్స్‌, వాట‌ర్ బాటిల్స్‌, గ్లాసులు, ప్లేట్లు, గిన్నెలు, స్పూన్స్‌, స్కెచ్ పెన్స్‌, బుక్స్‌, పెన్సిల్ బాక్సులు చిన్నారుల‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ అంగ‌న్ వాడీ కేంద్రాల‌లో ఆధునిక స‌దుపాయాల‌ను క‌ల్పించేందుకు ఎస్‌బీఐ పాన్ ఇండియా లెవ‌ల్‌లో ముందుకు రావ‌డం ఆహ్వానించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. మిత్రా హోలిస్టిక్ హెల్త్ సొసైటీ చైర్మ‌న్ ల‌క్ష్మీరెడ్డి మాట్లాడుతూ పిల్ల‌ల‌కు మాన‌సికంగా, శారీర‌కంగా ఎదిగేందుకు అవ‌స‌ర‌మైన స‌దుపాయాల‌ను సీఎస్సార్ నిధులు కేటాయించ‌డం ఆనంద‌దాయ‌క‌మన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐసీడీఎస్ శేరిలింగంప‌ల్లి ప్రాజెక్టు ఆఫీస‌ర్ క‌విత‌, ఆదిత్య‌న‌గ‌ర్ సెక్టార్ సూప‌ర్ వైజ‌ర్ కోమ‌ల‌బాయి, అంగ‌న్ వాడీ టీచ‌ర్ ప‌విత్ర‌, స‌హాయ‌కురాలు సుజాత పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here