శిల్పారామంలో కూచిపూడి నృత్య వైభవం

శేరిలింగంప‌ల్లి, జూన్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ప్రముఖ నృత్యకారిణి సంధ్య రాజు శిష్యబృందం అందించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా శిష్యులు భావములోన, హనుమాన్ చాలీసా, శంకరాభరణం, నర్తన, రామచంద్రయ్య, స్వగతం కృష్ణ తదితర నృత్యాంశాలను హావభావాలతో, లయబద్ధంగా ప్రదర్శించి సభికుల ప్రశంసలు అందుకున్నారు. ఈ నృత్య ప్రదర్శనలో వెంకట్ గంగాధర్, లక్ష్మి, అదితి, వామిక, కీర్తిక, హాసిని, ఆధ్య, వర్షిత, శ్రీ అనఘ, ధృతి, జాహ్నవి తదితరులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. కార్యక్రమానికి హాజరైన కళాభిమానులు శిష్యుల అభినయం, నృత్య నైపుణ్యాన్ని అభినందిస్తూ, ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు భారతీయ సాంప్రదాయ కళల పరిరక్షణకు దోహదపడతాయని పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here