గౌతమ్ మోడల్ స్కూల్ మాజీ డీన్ సత్యనారాయణ పెద్దకర్మ

శేరిలింగంప‌ల్లి, జూన్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గౌతమ్ మోడల్ స్కూల్ మాజీ డీన్ సత్యనారాయణ పెద్దకర్మ కార్యక్రమాన్ని ఆదివారం బోరబండ బంజార నగర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్, బీజేపీ నాయకులు చింతకింది గోవర్ధన్ గౌడ్, రంగా గౌడ్, బీఆర్ఎస్ నాయకుడు మారబోయిన రవి యాదవ్, బీసీ నాయకుడు హరికృష్ణ, నిర్వాహకుడు బెజగం కేశవ్‌తోపాటు పలువురు నాయకులు, స్థానికులు పాల్గొని సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ విద్యా రంగానికి అందించిన సేవలను కొనియాడుతూ ఆయన జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సత్యనారాయణ లేని లోటు విద్యా రంగానికి, సమాజానికి తీరనిదని పలువురు పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here