5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరి: వెంకటేష్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, జూన్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని అల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పిలుపునిచ్చారు. అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పోలియో వ్యాధి నివారణకు టీకానే సమర్థవంతమైన మార్గమని, పిల్లల ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, శశిధర్ పట్వారీ, బోయ కిషన్, జి. రవి, మారెళ్ల శ్రీనివాస్, మహేష్, రవీందర్, కటిక రవి, డా. మౌనిక, సుజిలీలా, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here