శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయాన్ని గణనీయంగా పెంచిందని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. బాధితులకు అండగా, ఆపదలో ఉన్న వారిని ఆదుకోనేందుకే సీఎం సహాయ నిధి ఎంతగానో దోహదపడుతోందని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు బాధితులు అనారోగ్యం కారణంగా చికిత్స పొందిన అనంతరం జగదీశ్వర్ గౌడ్ కార్యాలయాన్ని సంప్రదించగా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయించి నియోజకవర్గంలోని 12 మందికి మంజూరైన రూ.5,95,000 ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను బాధితులకు నియోజకవర్గ నాయకులతో కలిసి జగదీశ్వర్ గౌడ్ అందజేశారు.
ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఇంటికి సంక్షేమమే లక్ష్యంగా ప్రజలకు మేలు జరిగేలా కృషి చేస్తున్నారని అన్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచేందుకు సీఎం సహాయనిధి ఉందని,అర్హులైన ప్రతి ఒక్కరు ఈ సీఎం ఫండ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది, సంక్షోభ సమయాల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రాణాలను కాపాడడంలో CMRF కీలక పాత్ర పోషించిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర లేబర్ సెల్ ఉపాధ్యక్షుడు నల్ల సంజీవ రెడ్డి, కూన సత్యం గౌడ్, ఉరిటి వెంకట్ రావు, వీరేందర్ గౌడ్, మన్నేపల్లి సాంబశివ రావు, శేఖర్ ముదిరాజ్, కనకమామిడి నరేంద్ర గౌడ్, తిరుపతి, డివిజన్ అధ్యక్షులు బాష్పాక యాదగిరి, మహమ్మద్ జహంగీర్, అలీ, మహిళా కమిటీ నాయకులు బ్లాక్ ప్రెసిడెంట్ శ్రీదేవి, మండల అధ్యక్షురాలు సునీత రెడ్డి, ఉపాధ్యక్షులు మల్లెల జయ, పార్వతి, అనిత, లక్ష్మి, సులోచన, శాంత, తన్వీర్ బేగం, నాయకులు హనుమంతు, రాజి రెడ్డి, వెంకన్న, పరశురాం, మల్లేష్, యాకయ్య, రాంబాబు, సర్దార్, మారయ్య, రాజు, శ్రీను, ఎల్లమ్మ, లక్ష్మణ, హనుమయ్య, గిరి, హరినాథ్ గౌడ్, హనీఫ్, శ్యామ్, రవి కుమార్, సుధాకర్ తదితరలు పాల్గొన్నారు.