పెండింగ్‌లో ఉన్న ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): కూకట్‌ప‌ల్లి సర్కిల్ పరిధిలోని కూకట్‌ప‌ల్లి(పార్ట్), వివేకానంద నగర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ డివిజన్ల పరిధిలో నెల‌కొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కూకట్‌ప‌ల్లి జోన్ జోనల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్, డీసీ గంగాధర్, ఇంజనీరింగ్ విభాగం , టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్‌ప‌ల్లి సర్కిల్ పరిధిలోని కూకట్‌ప‌ల్లి (పార్ట్), వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్ డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జోనల్ కమిషనర్ తో చర్చించడం జరిగింద‌ని , పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE గోవర్ధన్, టౌన్ ప్లానింగ్ ACP జీశాన్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here