శేరిలింగంపల్లి, డిసెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ హాల్ లో నిర్వహించిన అజెండా నం. 20 కార్పొరేషన్ 9వ ప్రత్యేక సమావేశంలో పిఏసీ ఛైర్మెన్, శేరిలింగంపల్లి శాసనసభ్యుడు ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్యే లు, జిహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీలో 27 యూఎల్బీ ల విలీనం, మున్సిపల్ కార్పొరేషన్ ను వార్డులుగా విభజించడం, వార్డుల డీలిమిటేషన్ కోసం సూచనలు, అభ్యంతరాల చర్చలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ లో సూచనలు, అభ్యర్థనలు వ్యక్తం చేశారు. భవిష్యత్తు కార్యాచరణ, విధివిధానాలపై మేయర్ కి కౌన్సిల్ సమావేశంలో సూచనలు చేశారు.






