నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డ‌మే ల‌క్ష్యం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TSWRI) బాలికల పాఠశాలలో జరిగిన కొత్త మెనూ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని రకాల మంచి వసతులతోపాటు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంద‌ని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గొప్ప నిర్ణయం తీసుకున్నార‌ని, విద్యార్థుల తరుపున త‌న‌ తరుపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాన‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, మంత్రిప్రగడ సత్యనారాయణ రావు, వినోద్, వేణు గోపాల్ రెడ్డి ,నగేష్ , ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here