శేరిలింగంపల్లి, డిసెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో శ్రీ సాయి బృందావన క్షేత్రంలో జోషి రాఘవేంద్ర శర్మ నేతృత్వంలో శిరిడి సాయిబాబా ఆలయంలో శ్రీ దత్త జయంతి మహోత్సవ సందర్భంగా గురువులని పూజించడం గురువుల విగ్రహాలని స్థాపన హారతి తీర్థ ప్రసాదము అన్న ప్రసాదము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, కాలనీ అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ హాజరయ్యారు. శ్రీ దత్త జయంతి పండుగను ఘనంగా జరుపుకోవాలని, సమాజంలో అందరూ కూడా గురువులను పూజించాలి, తల్లిదండ్రులను పూజించాలి, పెద్దలను గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాయుడు, ఆశయ గౌడ్, గణేష్ బాబు, నారాయణ, మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.