శేరిలింగంపల్లి, డిసెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు ఆధ్వర్యంలో జరుగుతున్న నిత్య కార్యక్రమాలలో ఈ వారం అన్నమ స్వరార్చన, నృత్యార్చనలో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు. తొలుత విష్ణు సహస్రనామ, అన్నమయ్యపుర గురు స్తుతి చేసి, తదుపరి శృతిలయ సంగీత కూచిపూడి నాట్యాలయ, పిఠాపురం. సంస్థ గురువు ప్రవీణ విశ్వేశ్వరరావు శిష్యులు కే. శ్రీ కృతి, కే. సంతోషి, ఎన్. ఎస్. ఎస్. కార్తీక, పి. రేష్మ, వి. బి. సి. నళిని, టి. స్వప్నిక, టి. ఆకృతి, ఎస్. చంద్రిక, ఎస్. ప్రవల్లిక, బి. ఉమాదేవి, కే. సింధు, ఎస్. జాహ్నవి, ఆర్. కుందన వరలి, జి. నాగ అక్షయ సంయుక్తంగా గణేశ కౌతం, నారాయణతే నమో నమో, అలరులు కురియగా, కులుకక నడవరొ కొమ్మలాలా, కొత్త పెళ్లి కొడుకై, ఒకపరి ఒకపరి, జగడపు చనవుల జాజర, ఇందరికి అభయంబు, తందనాన అనే ప్రఖ్యాత అన్నమాచార్య సంకీర్తనలకు కూచిపూడి నృత్య ప్రదర్శన చేయగా వీరికి గాత్ర సహకారం ఉపద్రష్ట సుజాత అందించారు. కాగా వీరికి మృదంగంపై కుమార్ వాయిద్య సహకారాన్ని అందించారు. తదనంతరం సంస్థ నిర్వాహకులు శాలువా, జ్ఞాపికతో కళాకారులను సత్కరించారు.