శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): విద్యార్థుల ఆవిష్కరణ శక్తి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంతోనే సమాజ భవిష్యత్తు నిర్మితమవుతుందని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ డివిజన్ లోని ఎస్ఎన్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకల్లో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ విద్యాబుద్ధులు నేర్పి సమాజానికి ఉత్తమ పౌరులను అందించే ఉపాధ్యాయులు ఆదర్శప్రాయులని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో క్షేత్రస్థాయిలో ఆరోగ్యం, విద్య సమన్వయ కార్యక్రమాలు చేపడితే విద్యార్థులు ఆరోగ్యంగా, విజ్ఞానవంతులుగా ఎదగడానికి తోడ్పడతాయని అన్నారు. ప్రతివిద్యార్థి క్రమశిక్షణతో ఉన్నతమైన చదువులను చదివి భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలను అధిరోహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ గౌడ్, అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మెన్ చల్ల నరసింహ రెడ్డి, రంగారెడ్డి జిల్లా బీసీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జేరిపేటి జైపాల్, శేరిలింగంపల్లి నియోజకవర్గం కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, శేరిలింగంపల్లి మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వెంకటయ్య, బీ స్మాట్ స్టేట్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ నారాయణరెడ్డి, జనరల్ సెక్రెటరీ భరత్ కుమార్, ట్రెజరర్ మీనందర్ రావు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ భీష్మారెడ్డి, స్టేట్ మెంబర్ అస్లాం, సీనియర్ కరస్పాండెంట్స్ వాసుదేవ్ రావు, కిరణ్ కుమార్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సెంట్ జెవియర్ రాజు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీనివాస్ శంకర్, బీ- స్మాట్ ఆర్గనైజర్స్ ప్రెసిడెంట్ నిజాం అలీ ఖాన్, జనరల్ సెక్రటరీ వెంకట్, ట్రెజరర్ హిమబిందు, అడ్వైజర్ ఆచార్య, వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రావు, జాయింట్ సెక్రటరీ జేసుదాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అఖిల్, స్కూల్ కరస్పాండెంట్స్, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.





