శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): చాకలి ఐలమ్మ 40 వ వర్ధంతి సందర్భంగా ఓల్డ్ హఫీజ్ పేట్ రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రజక సంఘం సభ్యులు సాగర్, భిక్షపతి, శంకర్, రాజకుమార్, శివ కుమార్, దేవేందర్, నరసింహ, మల్లేష్ , వెంకటేష్, శివ కృష్ణ, ఎం. రాజకుమార్, అనిల్ కుమార్, జనార్ధన్, సాయి కుమార్, విజయ్, భారత్ కుమార్ పాల్గొన్నారు.






