చందాన‌గ‌ర్ స‌ర్కిల్ ప్ర‌జావాణికి 10 ఫిర్యాదులు

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని చందాన‌గ‌ర్ స‌ర్కిల్ కార్యాల‌యంలో సోమ‌వారం నిర్వ‌హించిన ప్ర‌జ‌వాణి కార్య‌క్ర‌మంలో డిప్యూటీ కమీషనర్ D. శశి రేఖ, Revenue Section AMC మనికరణ్, ACP నాగిరెడ్డి, AMOH Dr. K. S. రవి, Engineering section ఇందిరాబాయి, Entomology section R.చిన్నా, UBD section సమీర, Electrical section లక్ష్మి ప్రియా పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా వారు స‌ర్కిల్ ప‌రిధిలోని ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల‌ను స్వీక‌రించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో 5 ఫిర్యాదులు రాగా, ఇంజినీరింగ్‌లో 4, రెవెన్యూ విభాగంలో 1 మొత్తం 10 ఫిర్యాదులు వ‌చ్చాయి. ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు DC శశి రేఖ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here