వరద నీటి కాలువ‌ నిర్మాణం పనుల‌ను త్వరితగతిన పూర్తి చేయాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో రూ. 1 కోటి 45 లక్షల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే BT రోడ్డు, వరద నీటి కాలువ‌ నిర్మాణం పనులను కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాలనీల అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని అన్నారు. గోకుల్ ప్లాట్స్ కాలనీలో రూ. 1 కోటి 45 లక్షల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే BT రోడ్డు, వరద నీటి కాలువ‌ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన వరద నీటి కాలువ‌ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు DE శ్రీదేవి, నాయకులు బ్రిక్ శ్రీనివాస్, గుమ్మడి శ్రీనివాస్ , సాంబయ్య, సంజీవ రెడ్డి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here