శేరిలింగంపల్లి, మార్చి 29 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ వడ్డెర బస్తీలో శ్రీశ్రీశ్రీ మహాంకాళి రేణుక ఎల్లమ్మ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని స్థానిక నాయకులు, భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించిన భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కళ్యాణం అనంతరం అట్టేపల్లి రామప్రభు, పురుషోత్తం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అట్టేపల్లి పురుషోత్తం, నాగిశెట్టి ప్రసాద్, వేముల రాజశేఖర్, గిరి, వినోద్, కృష్ణ పటేల్, ఓం ప్రకాష్, బండారి అశోక్, గోపాల్, మోహన్, వినయ్, ఇలియాజ్ షరీఫ్, శ్రీకాంత్ యాదవ్, దినేష్ చారి, బాబురావు, తిమ్మరాజు, గిరి, గోల్కొండ వెంకట్ స్వామి, సాయిరాం, దినేష్ గౌడ్, తిరుపతి, గురువమ్మ, లలిత, శివమ్మ, హరినాథ్, శ్రీనివాస్, యాకయ్య, రమేష్, రజనీకాంత్, కరుణాకర్, వినీత్, సాయితేజ, అజయ్, ప్రశాంత్, చంద్రిక, కల్పన, కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.






