నాయ‌కులుగా ఎద‌గాలంటే స‌రైన శిక్ష‌ణ చాలా అవ‌స‌రం: ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, ర‌వికుమార్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి, మార్చి 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శిక్షణా తరగతులలో నేర్చుకున్న ప్రతి అంశం చాలా విలువైనదని, ప్రతి ఒక్కరూ ఆచరించాల‌ని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ అన్నారు. ప్ర‌ధాని మోదీ మ‌న్‌కీ బాత్ కార్య‌క్ర‌మ వివ‌రాల‌ను వివ‌రించే కార్య‌క్ర‌మాన్ని శేరిలింగంపల్లిలోని చైతన్య కాలేజీలో నిర్వ‌హించారు. ఇందులో మోదీ మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మాన్ని ర‌వికుమార్ యాద‌వ్ వీక్షించారు. అనంత‌రం భారతీయ జనతా పార్టీ సంస్థాగత పర్వంలో భాగంగా మాతృ శ్రీ నగర్ వద్ద ఉన్న చైతన్య కాలేజీలో నిర్వహించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణా మాహాభియన్ 2026 ముగింపు కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, ర‌వికుమార్ యాద‌వ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ మన వ్యక్తిత్య నిర్మాణం ద్వారానే జాతి నిర్మాణం, జాతీయత నిర్మాణం, దేశ నిర్మాణం జరుగుతుందని నమ్మే ఏకైక పార్టీ బీజేపీ అని, నేర్చుకున్న ప్రతి అంశం మనకు మార్గనిర్దేశం చేస్తుంద‌ని అన్నారు.

శిక్షణ తరగతులు ప్రతి కార్యకర్తకు మార్గదర్శకంగా నిలుస్తాయ‌ని, నాయకులుగా ఎదగాలంటే సరైన శిక్షణ చాలా అవసరమ‌ని వారు అన్నారు. దేశంలో ఒక్క మన పార్టీలోనే ప్రతి కార్యకర్తకు క్రమశిక్షణతో కూడిన శిక్షణ ఇస్తార‌ని అన్నారు. శిక్షణ తరగతులు ప్రతి కార్యకర్తకు మార్గదర్శకమని, ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశం ఆచరణలో పెట్టాల్సిన అవసరముందని, మన బీజేపీ పార్టీ సిద్ధాంతాలు, దేశ చరిత్ర, నాయకత్వ లక్షణాలు, సమాజ సేవలో ఎలా ముందుకు సాగాలో తెలుసుకోవచ్చని అన్నారు. మంచి నాయకుడిగా మారాలంటే సరైన శిక్షణ కూడా అవసరమని అన్నారు. కార్యకర్తలకు, నాయకులకు క్రమశిక్షణతో కూడిన శిక్షణ ఇచ్చేది దేశంలో ఒక్క మన బీజేపీ పార్టీనేనని కొనియాడారు. 14 కోట్ల సభ్యత్వాలు, 7,60,000 వేల బూత్ కమిటీలు, 17000 మండల కమిటీలు, 960 పైగా జిల్లా కమిటీలు, 33 రాష్ట్రాల అధ్యక్షుల నియామకం, కమిటీల నిర్మాణం పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ మన బీజేపీ మాత్రమేనని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఇంచార్జి ఆలె భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, ఇంట్లెక్టువల్ సెల్ కన్వీనర్ బాల్దా అశోక్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేశవరావు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, పదాధికారులు, కార్యకర్తలు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here