Vertex Pleasant గేటెడ్ కమ్యూనిటీ అభివృద్ధికి కృషి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, మార్చి 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో ఉన్న Vertex Pleasant గేటెడ్ కమ్యూనిటీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నికైన కాలనీ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని ఆయ‌న‌ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అభినందించారు. అనంత‌రం PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ Vertex Pleasant గేటెడ్ కమ్యూనిటీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకుడు రాగ ప్రసాద్, Vertex Pleasant గేటెడ్ కమ్యూనిటీ రెసిడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బద్రినారాయణ, జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ కొఠారి, ట్రెజరర్ DNS రాంచంద్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here