బీజేపీలో యువ‌త‌ను ఎక్కువ‌గా చేర్పించాలి

  • బీజేవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు పవన్ కుమార్

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం ప‌రిధిలోని కొండాపూర్ డివిజన్ ఎక్సలెన్సియా జూనియర్ కాలేజీలో శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేవైఎం కన్వీనర్ కుమ్మరి జితేందర్ ఆధ్వర్యంలో బీజేవైఎం శేరిలింగంపల్లి అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు పవన్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు.

కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న బీజేవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు పవన్ కుమార్

ఈ సంద‌ర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ బిజెపి సీనియర్ నాయకులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి, నాయ‌కులు భీమ్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్ల‌ నుండి బీజేవైఎం పూర్తి కమిటీ నాయ‌కులు, జిల్లా, రాష్ట్ర నాయకులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో పవన్ కుమార్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని అన్ని డివిజన్ ల‌లో బీజేవైఎం కమిటీలను పూర్తిచేయాలని అన్నారు. అలాగే డివిజన్లలో యువ మోర్చా నిర్వహించే ప్రతీ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి అసెంబ్లీలోని ఎక్కువ శాతం యువకులను బీజేపీలోకి చేర్పించే కార్యక్రమాన్ని బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించాలని సూచించారు.

ప‌వ‌న్‌కుమార్‌ను స‌న్మానిస్తున్న బీజేవైఎం నాయ‌కులు

శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేవైఎం కన్వీనర్ కుమ్మరి జితేందర్ మాట్లాడుతూ బీజేవైఎం రాష్ట్ర, జిల్లా నాయకత్వం పిలుపునిచ్చే ప్రతీ కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి అసెంబ్లీ, నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని అన్ని డివిజన్లలో అధిక సంఖ్యలో నిర్వ‌హించాల‌ని, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు కార్య‌క్ర‌మాల్లో భారీ సంఖ్య‌లో పాల్గొని విజయవంతం చేయాల‌ని అన్నారు. ప్ర‌ధాని మోదీ యువ‌త‌, విద్యార్థులు, నిరుద్యోగుల‌కు ఉప‌యోగ ప‌డే విధంగా ఎన్నో ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టార‌ని, వాటిని ల‌బ్ధిదారుల‌కు చేరే విధంగా బీజేవైఎం నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. అనంత‌రం ప‌వ‌న్ కుమార్‌ను బీజేవైఎం నాయ‌కులు స‌న్మానించారు.

ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బి.అశోక్, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ అభ్య‌ర్థి ఎం. రఘునాథ్ యాదవ్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు హరిక్రిష్ణ, చంద్రమోహన్, సురేష్, హరిప్రియ, బీజేపీ కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు జయరాములు, బీజేవైఎం జిల్లా నాయకులు రాహుల్, శివ గౌడ్, అజయ్, గంగాధర్, వెంకటేష్ యాదవ్, రాజేందర్ రెడ్డి, బీజేవైఎం డివిజన్ అధ్యక్షులు నవీన్ రెడ్డి, సిద్దూ, శివకుమార్, ఆనంద్ కుమార్, క్రాంతి, బీజేవైఎం డివిజన్ నాయకులు మహేష్ గౌడ్, అచ్యుత్ రెడ్డి, శివ, మహేష్, ప్రవీణ్, సాయి, శివాజీ, సంజయ్, మనోజ్, అఖిల్, సోను పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here