శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ప్రధాన మంత్రి ఆత్మ నిర్భర యోజన లేదా ప్రధాన మంత్రి స్వనిధియోజన పథకం కింద వీధి వ్యాపారులు రుణాలను పొందేందుకు కేవలం శుక్రవారంవారం వరకు మాత్రమే గడువు ఉందని యూసీడీ విభాగం ప్రాజెక్ట్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. చందానగర్, శేరిలింగంపల్లి జంట సర్కిళ్లకు చెందిన వీధి వ్యాపారులు గడువు ముగిసే లోపు రుణాలను పొందేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇందులో భాగంగా వారు తమకు సమీపంలోని మున్సిపల్ కార్యాలయంలో తమ ఆధార్ కార్డు, వీధి వ్యాపారుల గుర్తింపు కార్డు, ఇంటి కరెంటు బిల్లు, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్, పాస్ పోర్టు సైజ్ ఫొటోలను ఇచ్చి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. లబ్ధిదారులు గడువు ముగిసేలోగా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.