శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): బోయినపల్లి ఎంఎంఆర్ గార్డెన్ లో మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో తెలుగు మళయాళీ స్నేహ వేదిక 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో కేరళ రాష్ట్ర ఎమ్మెల్యే చాందీ ఊమెన్, కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, బిసి ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా పలువురికి కళ్లద్దాలను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాలికల నృత్య ప్రదర్శన, లంబాడీల నృత్యాలు, కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో మారడవల్లి కిట్టు యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, సలహాదారు కృష్ణమోహన్, యువత అధ్యక్షుడు కుమార్ యాదవ్, వనపర్తి జిల్లా గొర్ల మేకల పెంపకం దారుల అధ్యక్షుడు మధు యాదవ్, బోయిన్‌పల్లి కృష్ణ యాదవ్ పాల్గొన్నారు.






