శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమాచార్య భావనా వాహిని అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు ఆధ్వర్యంలో కొనసాగుతున్న నాదబ్రహ్మోత్సవ్- 2025లో భాగంగా ఐదవ రోజు సాయంత్రం ఉషా గాయత్రి నృత్య కిన్నెర బృందం నీరజ, వాణి భవాని, లక్ష్మి శ్రీ, అర్చన, శ్రద్ధ, తన్మయి, లక్ష్మీ వాత్సల్య, లౌక్య సమేతంగా శ్రీమన్నారాయణ, వినరో భాగ్యము, విన్నపాలు, నారాయణతే, కులకగ, ఒకపరి, చక్కని తల్లి, గోవింద గోవింద యని, వాడల వాడల, వీధుల వీధుల, జగడపు అనే సుమనోహర అన్నమయ్య సంకీర్తనలకు నయన మనోహరంగా చక్కని నృత్యాభినయం చేశారు. ఈ కార్యక్రమానికి జ్వాలా నరసింహారావు వనం, రోచిష్మాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటు తిరుమలలో బ్రహ్మోత్సవాలు, ఇటు అన్నమయ్యపురంలో అన్నమయ్య పాటలకు నాద బ్రహ్మోత్సవం అని శోభారాజు చేస్తున్న కృషిని, కళాకారుల ప్రదర్శనలను కొనియాడారు. చివరిగా శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతులు అందించి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.






