శేరిలింగంపల్లి, నవంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): దీక్షా దివస్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లిలోని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలో ఉన్న మాధవరం నగర్ కాలనీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు స్థానిక నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గండి మైసమ్మ చౌరస్తాలోని మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రోజా దేవి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఇది శుభప్రదమైన రోజని అన్నారు. 2001లో బీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్ 2009లో నవంబర్ 29వ తేదీన దీక్ష చేపట్టి ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించి ప్రత్యేక తెలంగాణను సాధించారని గుర్తు చేశారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఈ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ఆనాడు ఆయన చూపిన తెగువ, ఉద్యమ స్ఫూర్తి ఎంతో మంది యువతకు ప్రేరణగా నిలిచిందన్నారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మళ్లీ అలాంటి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గొట్టుముక్కల పెద్ద భాస్కరరావు, మాచర్ల భద్రయ్య, వేముల ఆంజనేయులు, శ్రీనివాస్, సత్యనారాయణ, జగదీష్ గౌడ్, రామచందర్, రవీందర్ రావు, నరసింహారెడ్డి, మోహన్ రావు, మల్లయ్య, శేఖర్, బండప్ప, యాదగిరి, ప్రవీణ్, బాబు, విక్రమ్, చిన్నా, సోమేష్ , అరవింద్, రవి, మోహన్ చారి, శ్రీనివాస్, జై, కుమార్, వెంకటేశ్వరరావు, సంతోష్, నవీన్, హరి, అనిల్, ప్రవీణ్, మల్లేష్, నవీన్ చారి, వెంకట్, మహేష్, మురళి, సతీష్, రామ్మూర్తి, సాయి, రాము, మాధవి రెడ్డి, శైలజ, రాధిక, కరుణ తదితరులు పాల్గొన్నారు.





