శేరిలింగంపల్లి, నవంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ హఫీజ్ పేట్ ప్రేమనగర్ బి బ్లాక్ లో అల్లావుద్దీన్ పటేల్ ఆధ్వరంలో ఏర్పాటుచేసిన బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అనే పేరు చెప్పుకుంటున్నామంటే దానికి బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ వల్లనే సాధ్యమైందని, తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే గాంధీ ఏ పార్టీలో ఉన్నాడో తనకే తెలియట్లేదని, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి కేటీఆర్ కోట్ల రూపాయల నిధులు శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ఇచ్చారని, ఎమ్మెల్యే గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినప్పటి నుండి ఎన్ని కోట్ల నిధులు తెచ్చారని ప్రశ్నించారు. పార్టీ కోసం ప్రజల కోసం పనిచేసేవారికి కార్పొరేటర్ ఎన్నికలలో, ఎమ్మెల్యే ఎన్నికలలో అవకాశాలు ఇప్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గాంధీ పై వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేటర్లు తిరిగిరావాలని కోరారు. మాజీ కార్పొరేటర్ నవత రెడ్డి చెప్పినట్టు జై తెలంగాణ అనే పదం ఎమ్మెల్యే గాంధీ నోటు వెంట రాలేదని, దానికి సాక్ష్యం మాజీ కార్పొరేటర్ సాయిబాబా అని చెప్పడం ఎంతో ఆశ్చర్యంగా ఉందని అన్నారు. తమ కార్యకర్తలను పోలీసులు ఇబ్బంది పెడుతూ కేసులు బనాయిస్తున్నారని, అధికారం ఎవరికి శాశ్వతం కాదు అని, తమ కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్ట సాయిబాబా, మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి, కంటెస్టెండ్ కార్పొరేటర్ రవి యాదవ్, సీనియర్ నాయకులు రంగారావు, వాల హరీష్ రావు, గంగారం సంగారెడ్డి, బాబు మోహన్ మల్లేష్, శ్రీనివాస్ గౌడ్, చందానగర్ శ్రీకాంత్, రోజా, డివిజన్ సీనియర్ నాయకులు సంతోష్, బాలరాజ్, లక్ష్మణ్, మహేందర్, రాజశేఖర్, యాదగిరి, శ్రీను, నాయుడు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.





